పిచ్చికుక్క స్వైరవిహారం
-ముగ్గురికి తీవ్ర గాయాలుపిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ముగ్గురికి తీవ్రంగా గాయాలు చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే eల్రెఏ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెత్తేట్ల వజ్రవ్వ (56),నెత్తేట్ల మహాన్వీ (3),నెత్తేట్ల విఘ్నేష్(11) ఆరు బయట ఉండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన పిచ్చి కుక్కలు దాడి చేసి విచక్షణంగా రహితంగా గాట్లు వేసింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట పి హెచ్ సి కి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న పిచ్చికుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
