ప్రాంతీయం

చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవు

70 Views

చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవు

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఐపిఎస్

ఎస్ ఎం విజయ్ కుమార్,

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 28, ( తెలుగు న్యూస్ 24/7)

రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో నిషేధిత నైలాన్ సింథటిక్ మాంజా (చైనా మాంజా) దారాలను అమ్మినా, నిల్వ చేసినా లేదా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తెలియజేయడమైనది.గాలిపటాలు ఎగురవేసే సమయంలో వాడే ఈ సింథటిక్ దారాలు వాహనదారుల మెడకు చుట్టుకుని ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ దారాలు చెట్లకు చుట్టుకుని పక్షుల కాళ్లు, రెక్కలు తెగిపోవడానికి, అలాగే పశువులు గాయపడటానికి కారణమవుతున్నాయి.జిల్లాలోని వ్యాపారులు ఎవరూ కూడా ఇటువంటి నిషేధిత మాంజా దారాలను విక్రయించరాదని, కేవలం పర్యావరణ హితమైన కాటన్ దారాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని సూచించాడమైనది. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని మరియు షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించడమైనది.జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించడమైనది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరాడమైనది.

 

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *