నవంబర్ 19న గజ్వేల్ లో పీ.డీ.ఎస్.యు జిల్లా 4వ మహాసభ..!
గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!!
సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 4
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా నాలుగవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ 1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డి, జేసిఎస్ ప్రసాద్ ప్రేరణతో ఆవిర్భవించిన పీ.డీ.ఎస్.యు యాభై సంవత్సరాలుగా శాస్త్రీయమైన మరియు అందరికీ సమానమైన విద్య కొరకు మరియు విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే జార్జి, జేసీఎస్ ప్రసాద్,శ్రీపాద శ్రీహర్ , కోల శంకర్, రంగవల్లి, స్నేహలత లాంటి అనేకమంది విద్యార్తి రత్నాలు బిగిపిడికిలి జెండా కోసం అమరులు అయ్యారని తెలిపారు. అదే విధంగా టీ.పీ.టీ.ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో విద్య రంగానికి సరైన కేటాయింపులు లేకపోవడం వల్ల ప్రభుత్వ విద్యా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. మరోవైపు విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏకపక్షంగా అమలు పరిచే విధానాలకు పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఈ నేపథ్యంలోనే పీ.డీ.ఎస్.యు సంస్థ గడిచిన కాలంలో నిర్వహించిన విద్యార్తి ఉద్యమాలను సమీక్షించుకుని ,విద్యారంగ సమస్యలను పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవడం కోసం నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో జిల్లా 4వ మహాసభలను నిర్వహిస్తున్నారని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రమేష్ మరియు టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్,జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,గజ్వేల్, జగదేవపూర్, వర్గల్, రాయపోల్ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సత్తయ్య, పర్వతం నర్సయ్య, గోవర్ధన్ రెడ్డి, పోచం, రాములు, విద్యా సాగర్,సీనియర్ నాయకులు ఎల్లయ్య, సత్తయ్య, శంకర్, కటుకం రాజయ్య,మధుసూదన్, మోహన్ రావు,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాములు, ఉపాధ్యాయులు వేణు,యాదగిరి, తుమ్మ సత్తయ్య, నర్సిములు, కృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





