పాములపర్తి విద్యానగర్ కాలనీ పదోవ వార్డులో శ్రమదాన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా, మర్కుక్, డిసెంబర్ 28, (తెలుగు న్యూస్ 24/7)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో 10వ వార్డు లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్ వచ్చారు ఈ సందర్భంగా బాలకిషన్, మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ పాములపర్తి గ్రామ పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం చేసుకోవడం,చాలా మంచిది, యువత ముందుకు రావడం వల్లే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది,అని తెలపడం జరిగింది. ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మొద్దు చంద్రం, కొండనోళ్ళ నరేష్, గిద్దెల రాజు, శర్ధని అంజి, అక్కారం సంతోష, మొద్దు మహేష్, మొద్దు రాజశేఖర్, గిద్దెల ఎల్లవ్వ, తదితరులు పాల్గొనడం జరిగింది.





