42%తోనే జెడ్పిటిసి ఎన్నికలకు వెళ్లాలి వల్లెపు నర్సింలు డిమాండ్
సిద్దిపేట్ జిల్లా,గజ్వేల్, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేటజిల్లా గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షులు వల్లపు నర్సింలు,మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ బీసీ సంఘాలు తెలిపారు గ్రామపంచాయతీ ఎన్నికలకు ముగిశాక ప్రస్తుతం ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అన్నారు ఈ సందర్భంగా గురువారం ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డి,కి బహిరంగ లేఖ రాశారు రాబోయే అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి 42% బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధకరమైన అమలు చేయాలన్నారు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు పార్టీ పరంగానే జరుగుతాయి అన్నారు. బీసీలకు 42రెండు శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వల్లపు నరసింహులు,సలేంద్ర శ్రీనివాస్ యాదవ్ బలమైన శ్రీనివాస్ యాదవ్ వెంకటాచారి రాజు తదితరులు పాల్గొన్నారు.





