ఎర్రజెండా వైపే ప్రజల చూపు
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
సిపిఎం లో పలువురు చేరిక
సిద్దిపేట జిల్లా చేర్యాల, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7
చేర్యాల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎర్ర జెండా వైపే ప్రజలు ఉంటారని సిపిఎం, సిద్ధిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అన్నారు.చేర్యాల మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన నంగి మైసయ్య తో పాటు పలువురు సిపిఎం పార్టీ లో చేరగా కి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అముదాల మల్లారెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తి రెడ్డి, జిల్లా కమిటి సభ్యులు కొంగరి వెంకట్ మావో, మండల కార్యదర్శి బండకింది అరుణ్, చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్,జిల్లా కమిటి సభ్యులు దాసరి ప్రశాంత్ ,పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, పట్టణ నాయకులు పోలోజు శ్రీహరి, ఇప్పకయాల శోభ, తుప్పతి రాజు, బోయినీ మల్లేశం, గుర్జకుంట పార్టీ నాయకులు దర్శనం రమేష్, కాశెట్టి ఆంజనేయులు,శెట్టి కిష్టయ్య, బొప్పనపల్లి ఎల్లయ్య, కత్తుల నర్సింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.





