మంచిర్యాల నియోజకవర్గం.
రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, లక్షెటీపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
