బసానుకుంట చెరువులో పడి మహిళ మృతి
సిద్దిపేట జిల్లా,మర్కుక్,( తెలుగు న్యూస్ 24/7)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బెల్దే పద్మ (55), భర్త నాగరాజు, గురువారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బసానుకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఉదయం 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దుగా వెళ్తున్న స్థానికులు నీటిలో మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.మృతురాలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు మార్కుక్ మండల ఎస్సై దామోదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





