సిద్దిపేట జిల్లా పెద్ద గుండవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఫీజులు గుండెల కరుణాకర్ చెల్లించారు. ఈ సందర్భంగా గుండెల కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని అందరూ 500 పైన మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు ఏమి తక్కువ కాదని, వాటికి దీటుగా పోటీ పడాలని అన్నారు. 10వ తరగతి మీ భవిష్యత్తుకు మొదటి అడుగు కాబట్టి మీరందరూ మంచిగా చదువుకోవాలని మీరు ఉన్నంత స్థాయిని అధిరోహించాలని తెలిపారు. గ్రామానికి, మీయొక్క తల్లిదండ్రులకు, పాఠశాలకు ఉపాధ్యాయులకు, మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం గానీ, టీవీలు పెట్టడం వీలైతే మూడు నెలలు టీవీ రీచార్జ్ చేయకండని, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, పొలాల పనికి పొమ్మని చెప్పకుండా విద్యార్థులు ఎలా చదువుతున్నారో గమనించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, గుండెల బాబు, గంట అజయ్, జాలియం నవీన్, మల్లుగారి ప్రేమ్, గుండెల శ్రీకాంత్, ఆశంగారి కిషన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.





