ప్రాంతీయం

ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత

173 Views

పాడైన రెండు కిడ్నీలు, ఏడాదిగా డయాలసిస్ పైనే జీవితం కొనసాగిస్తున్న యువకుడు

ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 )

ఆపన్న హస్త మిత్ర బృందం ఆర్థిక సహాయం, గజ్వేల్ ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద జరిగింది. బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్,ఈ మధ్యనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు, డాక్టర్ల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరం ఉందనంగానే మహేష్ తండ్రి సల్లూరి రామయ్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు, కానీ ఈ కిడ్నీ మార్చడానికి సుమారు 25 లక్షలు అవసరం ఉందని తెలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు, మిత్రులు సహాయంతో సోషల్ మీడియాలో వీళ్ళ బాధను పంచుకున్నారు ఈ విషయం మన గ్రూపు సభ్యుల ద్వారా తెలుసుకొని మన బృందం ద్వారా కుటుంబ సభ్యులను మన కార్యాలయం వద్ద పిలిచి మన వంతు సహాయం ₹20,000/- అందజేయడం జరిగింది. వీరికి ఎవరైనా సహకారం చేయాలి అనుకుంటే,98668 14178. లేదా 8179957295 కిఫోన్ పే&గూగుల్ పే ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని మహేష్ కుటుంబ సభ్యులు వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాం ప్రసాద్, సహాయ కార్యదర్శి కొలిచెల్మే స్వామి,సభ్యులు రాణి, శైలజ, శిరీష, రాంబాబు,రాజు, బాబు , సత్యనారాయణ, కృష్ణ, కనకరాజు, విశ్వేశ్వర రావు రాంరెడ్డి తో పాటు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్థులు , చంద్రశేఖర్ రెడ్డి, కుమార్ గౌడ్ పాల్గొనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *