ప్రాంతీయం

అసంపూర్తిగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను పూర్తి చేయాలి

41 Views

అసంపూర్తిగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను పూర్తి చేయాలి. పి డి ఎస్ యు.

మంచిర్యాల జిల్లా, జైపూర్.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో 24 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ పాఠశాల నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే 2024 మార్చి నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఆ పాఠశాలను పూర్తి చేయలేదు.సరిపడా తరగతి గదులు లేనందువల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఓకే తరగతి గదిలో మూడు తరగతుల విద్యార్థులు చదవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఒక తరగతి గదిలో వంటగది కూడా ఉండడంవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు,స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *