ముస్తాబాద్, డిసెంబర్ 22, (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామానికి చెందిన కొమ్మాట రాజు వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయగా వార్డ్ ప్రజలు ఆశీర్వదించి 4వ. వార్డ్ మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా తెర్లుమధ్ది గ్రామంలో తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు. వార్డ్ మెంబర్ కొమ్మాట రాజు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో గ్రామీణ ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైతి దుర్గమ్మ తనయుడు (నవీన్) అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు కొమ్మాటరజు, గ్రామస్తులు పాల్గొన్నారు.




