మీర్జాపూర్ సర్పంచిగా బాధ్యతలుస్వీకరించిన వేల్పుల సంపత్ కుమార్
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ప్రజా సంక్షేమం నా ద్వేయం లక్ష్యం
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, డిసెంబర్
( తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ గా వేల్పుల సంపత్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజాపూర్ సర్పంచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అంతేకాకుండా ఈ గెలుపు నాకు సహకరించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గ్రామంలోని అన్ని సమస్యలపై అవగాహన ఉందని ప్రతి సమస్యను ఓర్పుతో నేర్పుతో అధిగమించేందుకు కృషి చేస్తానని గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరు సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామాన్ని అధిక నిధులు తీసుకువచ్చి సిద్దిపేట జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పుట్టిన ఊరుకు రుణం తీర్చుకునే భాగ్యం కలిగిందని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని కచ్చితంగా వినియోగించుకొని పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సమాన న్యాయం చేస్తానని ప్రతి పేదవాడింటికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు ప్రజలు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు స్పెషల్ అధికారి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





