ప్రాంతీయం

22 Views

ఈ నెల 23న నమోదు, లైసెన్స్ మేళా,జిల్లా ఆహార తనిఖీ అధికారి వాసురామ్.

మంచిర్యాల జిల్లా డిసెంబర్ 22, 2025:
ఈ నెల 23వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదటి అంతస్తులు గల ఆహార భద్రతా శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆహార కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల కొరకు ఎఫ్. ఎస్. ఎస్. ఎ. ఐ. నమోదు, లైసెన్స్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆహార తనిఖీ అధికారి వాసురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్. ఎస్. ఎస్. ఎ. ఐ. చట్టం ప్రకారం ప్రతి ఆహార వ్యాపారి లైసెన్స్ / రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, లేని వారికి చట్ట ప్రకారం 5 లక్షల రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. లైసెన్స్/ రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు జి ఎస్ టి, ట్రేడ్ లైసెన్స్, రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని రావాలని తెలిపారు. ఇతర వివరాల కొరకు 6300384625 నెంబర్ లో సంప్రదించవచ్చని, జిల్లాలోని వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *