- కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించండి..
కార్మిక, కర్షక అనుకూల విధానాల సాధనకై సిపిఎం నిరంతర పోరాటం
సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3
నాగపురి నేడు సంపద సృష్టించే కార్మిక, కర్షక అనుకూల విధానాలను వీడి పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలను ప్రోత్సహించే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సిపిఎం నిరంతరం పోరాడుతుందని అంతిమంగా కార్మికులది కర్షకులదే విజయమని సిపిఎం నిర్వహించే పోరాటాల్లో కార్మికులు కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోరాడాలని నేడు దేశంలో ఉన్న బూర్జువా పార్టీలను ప్రతిఘటించిన నాడే కార్మికుల, కర్షకులకు అనుకూల పరిస్థితులు సాధ్యమైతాయని దోపిడి విధానం పోయి సమ సమాజం సిద్ధిస్తుందని నిత్యం కార్మికుల కోసం, కర్షకుల కోసం నిర్వహించే పోరాటాల్లో శ్రామికులు, కర్షకులు పాల్గొనాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ పిలుపునిచ్చారు. చేర్యాల మండలం నాగపురి గ్రామ సిపిఎం పార్టీ శాఖ మహాసభ మోకు దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నాగపురి లో జరిగింది. ఈ గ్రామ శాఖ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని రాళ్ల బండి శశిధర్ మాట్లాడుతూ నేడు దేశంలో కార్మిక వర్గం, రైతులు, శ్రామిక ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతుల, కార్మికుల, శ్రామిక ప్రజల బతుకులు దుర్భరంగా దిగజారిపోతున్నాయి తప్ప ఈ కార్పొరేటు అనుకూల విధానాలను అమలు చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా సంపన్న కార్పొరేట్ లకే కొమ్ముగాస్తున్నాయని దీనిపై శ్రామికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున సిపిఎం నిర్వహించే పోరాటాల్లో భాగస్వాములు కావాలని నాగపురి గ్రామంలో మహిళలు యువకులు సిపిఎం నిర్వహించే పోరాటాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాసభలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా మోకు ఇంద్రం ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా భూలక్ష్మీ నర్సింగరావును ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, మండల కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్, ఎన్ కనకయ్య, మోకు దేవేందర్ రెడ్డి , బోయిన మల్లేశం, ధన్ల రమేష్, గంధాల బాలు, ఎస్డి ఇస్మాయిల్, గర్నపెల్లి చంద్రం, జిడాల చంద్రయ్య, ఆవుల చంద్రయ్య, ముత్తగారి లక్ష్మయ్య, కుర్జకుంట కనకయ్య, ముత్తగారి శ్రీను, దేవులపల్లి రమేష్, దేవులపల్లి కృష్ణమూర్తి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.





