ఘనంగా కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం
మార్కుక్, డిసెంబర్ 22,( తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కవిత నర్సింలు, ఉప సర్పంచ్ అన్వర్ పాషా, వార్డు సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మా గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, కర్కపట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు అనంతరం, కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించిన సీనియర్ నాయకులు సుగుణాకర్ రెడ్డి, రాళ్ళబండి బాలకృష్ణ మాట్లాడుతూ నూతన సర్పంచ్ కవిత నర్సింలు, ఉప సర్పంచ్ అన్వర్ పాషా, వార్డ్ సభ్యులకు అభినందనలు తెలిపారు కర్కపట్ల గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని, గ్రామస్తులు అందరితో మమేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గానికి,గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వార్డ్ సబ్యులు, పాలే మహేందర్, ఐలేని యాదవ్,కల్పన,నవనీత,భాగ్యమ్మ,గణేష్,నరేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు





