ప్రాంతీయం

రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక

62 Views

జగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక

జగదేవపూర్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7)

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన రజక సంఘం సర్వసభ్య సమావేశంలో తిగుల్ గ్రామానికి చెందిన సీతారాములును మండల రజక సంఘం అధ్యక్షునిగా ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సీతారాములు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల రజక సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని రజకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రజక కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలీరాజ్ పెట్ సర్పంచ్ రాచమల్ల ఎల్లేష్, ప్రజ్ఞాపూర్ రజక సంఘం అధ్యక్షులు నర్సింలు, చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన సీతారాములుకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *