చేబర్తి గ్రామ సర్పంచ్ గా ర్యాకం యాదగిరి ప్రమాణ స్వీకారం
ఆదర్శ గ్రామంగా దిద్దుతాం – నూతన పాలకవర్గం
మర్కుక్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ సభ్యులు సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకం యాదగిరి మాట్లాడుతూ ముందుగా చేబర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు,మా మీద నమ్మకంతో మాకు ఓటు వేసి గెలిపించిన వారికి,మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ సబ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు





