గజ్వేల్ నుండి చేగుంటకు వెళ్లే బస్సు వయా ఇంద్రుప్రియల్, మహ్మద్ షాపూర్, గొడుగుపల్లి మీదుగా వెళ్లాలని దౌల్తాబాద్ ఏఎంసి వైస్ చైర్మన్ మద్దెల స్వామి తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ బాబు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, నాయకులు స్వామి, మధు, మల్లేష్, వెంకట్, మహేష్, నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





