ప్రాంతీయం

లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం

80 Views

జనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగే యు జి సి – ఎన్ ఈ టి – 2026

-జేఈఈ -2026లకు అర్హత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణకు మే నెలలో నీట్( ఎన్ ఈ ఈ టి )-2026 ఆఫ్

-లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం.

జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 19,( తెలుగు న్యూస్ 24/7)

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగే యు జి సి – ఎన్ ఈ టి – 2026 మరియు జే ఈ ఈ -2026లకు అర్హత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణకు మే నెలలో నీట్( ఎన్ ఈ ఈ టి )-2026 ఆఫ్ లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో యు జి సి – ఎన్ ఈ టి – 2026 కోసం ఒక సెంటర్, జేఈఈ -2026 కోసం 2 సెంటర్ లలో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్ టి ఏ) మార్గదర్శకాల ప్రకారం సెంటర్ లను ఎంపిక చేసి ఆ సెంటర్ లో సీసీ కెమెరా, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్, టాయిలెట్స్, కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఇతరత్రా అన్ని సౌకర్యాలు చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ లను తనిఖీ తర్వాత ఆ నివేదికను( ఎన్ టి ఏ) కు పంపించాలని తెలిపారు.ఈ సమావేశం లో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ రాజ్ కుమార్, కెవి ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, పోలీస్, ఎన్ఐసి అధికారులు తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *