ప్రాంతీయం

ఏపీజే అబ్దుల్ కలాం వేడుకలు

69 Views

 

భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

సిద్దిపేట జిల్లా జూలై 27

సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం కోహెడ మండలం భారతరత్న, భారతదేశ 11వ, రాష్ట్రపతి డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కాలాం 9వ, వర్ధంతి వేడుకలు శాఖ గ్రంధాలయంలో ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ప్రయివేటు హాస్పిటల్ లోని రోగులకు పండ్లు బ్రేడ్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అబ్దుల్ కలాం 1931లో అక్టోబరు 15 న, తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో, ఒక తమిళ ఉమ్మడి ముస్లిం కుటుంబంలో జన్మించారు. విద్యార్థులకు గొప్ప ప్రేరణ అందించినందుకు ఐక్యరాజ్యసమితి కలాం జన్మదినాన్ని (అక్టోబర్ 15) ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’ గా ప్రకటించింది. కలాం పూర్తి పేరు అవూల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. తండ్రి జైనులబ్దిన్ మరకాయర్ ఒక పడవ యజమాని తల్లి ఆషియమ్మ గృహిణి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు, సెయింట్ జోసెఫ్ కాలేజీ నుండి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా వరకు, పేపర్ బాయ్ నుండి ‘భారతరత్న ‘ వరకు చాల విషయాలు స్మరించుకోవాలి. కలాంను మీకు ఎలా పరిచయం చేయాలి, ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా,దార్శనికత కలిగిన లీడరుగా, భారతరత్న విజేతగా లేక యువతను దిశా నిర్దేశించిన రచయితగానా వీటన్నింటి కంటే కలాంలో నాకు ఒక గొప్ప మానవతావాది కనిపిస్తారు. కలాం మనిషిని ఎరిగిన మనిషి.మనిషి మూలాలకు కట్టుబడిన మనిషి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా, ఆయన రామేశ్వరం నాటి కలాంనే కనిపించారు. జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శం అని రాజు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గ్రంథ పాలకులు చిట్యాల బాలరాజు, పెరియాల లక్ష్మి కాంతారావు, సామజిక కార్యకర్తలు ఎత్తి మహేష్ జీపి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్