*పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపును పరిశీలించిన డీసీపీ*
రామగుండం పోలీస్ కమిషనరేట్..
పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ తో కలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను స్థానిక ఠాణాకు అనుసంధానం చేశారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న డీసీపీ రాంరెడ్డి ఠాణా నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మండలంలోని సమస్యాత్మక కేంద్రాల్లో ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలను తీయవద్దని పేర్కొన్నారు.





