ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
భారత దేశ పతాకం అయిన త్రివర్ణ పతాక వైభవాన్ని చాటడంలో భాగంగాప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు బీజేపీ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల గర్వంతోఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా,మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతోజాతి సమైక్యతకు ప్రతీకగా
ప్రతీ ఒక్కరం మన ఇళ్ళపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం దేశభక్తిని చాటుకుందాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పొన్నాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, సీనియర్ నాయకులు మద్దుల బుగ్గారెడ్డి, ఉడుగుల యాదగిరి, పారేపల్లి సంజీవరెడ్డి, పిట్ల శ్రీశైలం, బందారపు లక్ష్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి ,సోషల్ మీడియా కన్వీనర్ మాలోత్ కిరణ్ నాయక్ ,పట్టణ అధ్యక్షుడు గంట బాలకృష్ణ, వంగల రాజు, వంగ శ్రీకాంత్, షాగ లక్ష్మణ్ ,ఆకుల సాగర్, దాసరి పవన్, పరశురాములు ,నరసయ్య, భాను ,బాల్ రెడ్డి, అరవింద్, రంజిత్, కుమార్, గణేష్, రమేష్ ,కిష్టయ్య, మహేష్, పట్టూరి రాజేశం గుప్తా, దిటి నరసయ్య, చందుపట్ల రామ్ రెడ్డి ,లంబ కిషన్, వినయ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
