మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్.
సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7 )
ఈనెల 11వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారిచేయనైనది.





