ప్రాంతీయం

ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

27 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్.

*ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి….ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఉండకూడదు : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి*

నేడు ధర్మారం మండలం లో జరగబోయే రెండవ విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల జరగనున్న నేపథ్యం లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ, ఎన్నికల కమిషన్ కు లోబడి పని చేయాలని సూచించారు. ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు, పోలింగ్ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ ఎవ్వరినీ రానివ్వకూడదని పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల లోపల వారు పోలింగ్ కేంద్రాల కు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇతర వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా సంఘటన జరిగితే క్షణాలలో రూట్ మొబైల్ టీమ్ లు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలి తెలియజేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *