ముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా రాకెట్ లాగా దూసుకెళ్తున్నారు. ముస్తాబాద్ లో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా ఇతరులు 6 మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం చేస్తున్నారు. కాగా మండలంలోని ఓటర్ల సంఖ్య 7347 ఉండగా ఇందులో 3722 ఓటర్లు పురుషులకంటే మహిళలే అధికం, పురుషులు 3625 ఉన్నవి.
ముస్తాబాద్ లో మొత్తం 14 వార్డులు ఉండగా 1వ.వార్డులో ముగ్గురు, 2వ.వార్డులో ముగ్గురు 3వ.వార్డులో నలుగురు 4వ.వార్డులో ఐదుగురు 5వ.వార్డులో ముగ్గురు 6వ.వార్డులో ముగ్గులు 7వ.వార్డులో ముగ్గురు 8వ,వార్డులో ఇద్దరు 9వవార్డులో ఇద్దరు 10వ. వార్డులో ఎనమిది, 11వ. వార్డులో నలుగురు, 12వ. వార్డులో ముగ్గురు, 13వ. వార్డులో ఐదుగురు, 14వవార్డులో ఏడుగురు మొత్తం 55 ఉన్నారు, ఇకపోతే వార్డుల్లో ఓటర్ల సంఖ్య 1వ.వార్డులో 512, 2వ.వార్డులో 519, 3వ.వార్డులో 535, 4వ.వార్డులో 513, 5వ.వార్డులో 533, 6వ.వార్డులో 530, 7వ.వార్డులో 530, 8వ.వార్డులో 525, 9వ.వార్డులో 512, 10వ.వార్డులో 533, 11వ. వార్డులో 523, 12వ. వార్డులో 520, 13వ.వార్డులో 527, 14వ.వార్డులో 535 ఉన్నాయి. ఏదేమైనా ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికలు తగ్గేదేలే అన్నట్లుగా వాతావరణం సాగుతుంది.




