ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్.

22 Views

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్..

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం – ముత్యాల దివ్య, మహేష్  

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 )

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ కాసులబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్ పోటీలో ఉన్నారు. శుక్రవారం నాడు కాసులబాద్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ వాలీబాల్ గుర్తు పై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామస్తులు అందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు వాలీబాల్ గుర్తు పై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *