- యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్
ప్రియమైన పెద్దలూ, గ్రామ ప్రజలూ, నా యువ మిత్రులారా ఈరోజు మీ ముందుకు నేను ఒక అభ్యర్థిగా కాకుండా,మీ సేవకుడిగా, మీ ఇంటి పిల్లాడిగా, మీ యువరాజ్యానికి ప్రతినిధిగా నిలబడుతున్నాను.ఈ గ్రామం నా పుట్టినిల్లు, ఈ గ్రామం నా గర్వం,ఈ గ్రామం నా భవిష్యత్.గ్రామం అభివృద్ధి చెందాలి అంటే యువత ముందుకు రావాలి, మార్పు రావాలి, దృష్టి ఉండాలి.
అదే దృష్టితో నేను మీ ముందుకు వచ్చాను.
నా ప్రధాన హామీలు
1 మన ఊరి పోచమ్మ కొలుపు చేపిస్తా 2. మన ఊరి హనుమాన్ దేవాలయం కొత్తది నిర్మాణం 3. మన ఊరి రామాలయం చుట్టూ రేకులు నిర్మాణం చేస్తా4. యువత కోసం పవర్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు.5. మన ఊరి గోదావరి దగ్గర శివాలయం గుడి నిర్మిస్తా.6. మన ఊరి అవసరాల కోసం కమ్యూనిటీ హల్ నిర్మాణం.7. పక్కాగా రైతుల కోసం గోదావరి ఒడ్డుకు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రిఓపెన్ చేపిస్త రైతులకు పంట పొలాలకు నీరు అందిస్తా.8. అలాగే మన గ్రామంలో కనపడకుండా పోయిన గవర్నమెంట్ ల్యాండ్ బయటకి తీసుకువస్తా.9. మన గ్రామంలోమహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు.10. మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వాటర్ ప్లాంట్ నిర్మాణం
11. మన గ్రామ విద్యార్థినీ విద్యార్థులకు హైదరాబాద్ లో గ్రూప్ 1234 ఉచిత శిక్షణ ఇప్పించబడును.
✔ పక్కా నీటి సదుపాయం
✔ రోడ్లు – వెలుగుల అభివృద్ధి
✔ మురుగు వ్యవస్థ మెరుగుదల
✔ విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్స్ & డిజిటల్ లైబ్రరీ
✔ యూత్ కోసం స్పోర్ట్స్ గ్రౌండ్
✔ ఫిర్యాదులకు 24/7 అందుబాటులో ఉండే నాయకత్వం
✔ పారదర్శక పాలన – ప్రతి ఖర్చు ప్రజలకు స్పష్టంగా
యువత కోసం ప్రత్యేక హామీలు
✔ యూత్ కమిటీ ఏర్పాటు
✔ ప్రతి యువకుడికి ఉద్యోగ సమాచారం – స్కిల్ డెవలప్‌మెంట్
✔ స్పోర్ట్స్ & కల్చరల్ కార్యక్రమాలకు మద్దతు
✔ డ్రగ్స్/అడిక్షన్స్ నివారణ కార్యక్రమాలు
✔,రైతుల యొక్క వ్యవసాయ సదరు రోడ్ల నిర్మాణం.
✔,రైతులకు వ్యవసాయ పనులకు ఉపయోగించే సబ్సిడీ పనిముట్లు అందించడం.
చివరి సందేశం
గౌరవం ఇస్తేనే నాయకత్వం పుడుతుంది.
విశ్వాసం ఇస్తేనే గ్రామం ముందుకు సాగుతుంది.మీరు నాపై పెట్టే ఒక్క ఓట,నా కోసం కాదు,మన యువత భవిష్యత్తు కోసం,
మన గ్రామ అభివృద్ధి కోసం.యువతకి అవకాశం ఇవ్వండి – మార్పు చూపిస్తాను. యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్.





