మర్కుక్ మండలానికి అవార్డుల పంట
జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం
ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్రీ హరిష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు
దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ మండలానికి ఏకంగా జిల్లా స్థాయిలో 6 అవార్డులు కైవసం చేసుకుంది.ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి ఆడిటోరియం లో జిల్లా పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు ఎఫ్ డి సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ చేతులమీదుగా అవార్డులు పొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు శాలువాతో సత్కరించి మెమొంటో సర్టిఫికెట్ అందజేశారు. ఈ ఎంపీపీ పాండు గౌడ్ మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి సహకరించిన మండల ప్రజా ప్రతినిధులకు గ్రామ సర్పంచ్ లకు ఎంపీటీసీలకు ఉపసర్పంచ్ లకు వార్డు సభ్యులకు గ్రామ పెద్దలు పుర ప్రముఖులకు ముఖ్యంగా పారిశ్యుద్ద్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మర్కుక్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
