గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని లకముల కిష్టయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టోను విడుదల చేస్తూ గ్రామంలో అండర్ డ్రైనేజీ, శివాలయం చుట్టూ సిసి రోడ్లు, రామారం నుండి సయ్యద్ నగర్ వరకు వీధిలైట్లు, గ్రామంలో రెండు ఐమాక్స్ లైట్లు, రామారం నుండి ఉదయపూర్ వరకు సిసి రోడ్డు, ఊర్లో పూర్తికాన్ని పనులు పూర్తి, రామారం నుండి రాంసాగర్ వరకు మట్టిరోడు, ఐకెపి స్థలం కేటాయింపు, అర్హులైన వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు, కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, కోతులు, కుక్కలు బెడద లేకుండా, మెయిన్ రోడ్ పైన శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.





