ప్రాంతీయం

గ్రామ సర్పంచిగా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా…

20 Views

గ్రామ సర్పంచిగా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని వీరారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి పాపని నాగమణి వీరస్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఎన్నికైన పక్షం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామ ప్రజలకు అండగా నిలబడి, సమస్యల పరిష్కారంలో ఆదరణ చూపిస్తానన్నారు. ప్రజల ఆపద, సంతోషాలలో ముందుండి కలిసి సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచెప్పారు. రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేస్తూ, తనకు అవకాశమిస్తే గ్రామ అభివృద్ధికి మరింత ఫోకస్ చేస్తానని ప్రజలను ఆకర్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *