- సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా.
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ , చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా మంగళవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి , ముందు హాజరుపరచగా విచారణ చేసి 4గురికి ₹ 41,000/- రూపాయల జరిమాన విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ వాళ్ల కి పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.





