ప్రాంతీయం

మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే

31 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాలలో పలు వార్డులలో
పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు.

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడ , దొరగారి పల్లె, రాజీవ్ నగర్, గోపాల్ వాడ, సూర్య నగర్, రాజరాజేశ్వరీ కాలనీ పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

అనంతరం వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

అనంతరం రాజీవ్ నగర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్