రామకోటి రామరాజుకు ఘన సన్మానం
25సంవత్సరాల కృషి, పట్టుదల అమోఘం: జగదేవపూర్ భక్త బృందం
సిద్దిపేట జిల్లా జూన్ 7
గజ్వేల్ నియోజకవర్గం 25సంవత్సరాల నుండి రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి పట్టుదల అమోగమని జగదేవపూర్ వెంకటేశ్వర దేవాలయ కమిటీ వారు శుక్రవారం నాడు షాలువ కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భగవంతుని సేవ చేసుకోవడం అందరికీ రాదన్నారు. మా జగదేవపూర్ గ్రామస్తులచె భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటి తలంబ్రాలు అందజేసి, కళ్యాణం అనంతరం మళ్ళీ ముత్యాల తలంబ్రాలు మాకు అందించడం అందరికీ సాధ్యం అయ్యేపని కాదన్నారు.
అలాంటి రామభక్తి సేవ చేసుకోవడం రామకోటి రామరాజుకె చెందిందన్నారు. అందుకే భద్రాచలం దేవస్థానం రామకోటి రామరాజును మరో భక్త రామదాసుగా కీర్తించి సన్మానించడం ఆయన భక్తికి నిదర్శనం అన్నాడు.
ఈ కార్యక్రమంలో రామకోటి ప్రతినిధులు చిగుళ్లపల్లి వెంకటేశం, మరిపడిగే రాము, అయిత కేశవులు, బుద్ధ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
