పోలీస్ తనిఖీ చేయగా మద్యం బీర్లు లిక్కర్ లభ్యం.
సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా 08.12.2025 నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐపి ఎన్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందితో కలిసి వేములవాడ కమాన్ వద్ద మధ్యాహ్నం 01:30 గంటల సమయం లో వాహనలు తనిఖీ చేయుచుండగా సిద్దిపేట పట్టణం నుండి ఏపీ23యూ1371 నెంబర్ గల హ్యాపీ ఆటో రాగా, దానిని తనిఖీ చేయగా మద్యం బీర్లు మరియు లిక్కర్ లభించినాయి. తర్వాత ఆటో డ్రైవర్ను విచారించగా తన పేరు తాళ్లపల్లి శ్రీనివాస్ అని, తన గ్రామం రేగులపల్లి అని, రేగులపల్లి గ్రామంలో సర్పంచ్ గా నిలబడినటువంటి జింగిలి లక్ష్మి యొక్క అల్లుడైన కుంభం శ్రీకాంత్ యొక్క సూచనలు మేరకు సిద్దిపేట పట్టణంలో ని కనకదుర్గ వైన్స్ నుండి గొడుగు స్వామి మరియు నవీన్ వద్ద మద్యం తీసుకొని ఊరికి వెళుతున్నట్లు నేరం ఒప్పుకోలు చేసినాడు. దానితో వెంటనే అట్టి ఆటో ను మద్యం తో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుక వచ్చి కేసు నమోదు చేయడమైనది.





