ప్రాంతీయం

ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…

102 Views
 ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.
స్వతహాగా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక డిగ్రీలతోపాటు గొప్ప చదువులు చదివి సమాజంలోజరుగుతున్న అసమానతలపై పోరాటం చేసిన గొప్పవ్యక్తి అణగారిన వర్గాలకే కాకుండా యావత్ భారతావనికి దిక్సూచి ఆ మహానీయుడు ఏ ఒక్కరికి కాకుండా ఈ జాతి మొత్తానికి నాయకుడు ఆ మహానీయుని కర్తవ్యనిష్ఠ, దేశభక్తి భావితరాలకు అందించాలని కోరారు. ఈకార్యక్రమం ఏబీవీపీ కార్యకర్తలు, పాఠశాల విద్యాబోధకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్