సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని MPUPS ఆరేపల్లి పాఠశాల నందు శుక్రవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది .ఇందులో భాగంగా నికిత డిఈఓ గా వైష్ణవి ప్రధానోపాధ్యాయులుగా ఈశ్వర్, ఉపాధ్యాయులుగా ఆయేషా, జశ్వాంత్, ఇలియాజ్, సుభాన్, అక్షిత మరియు జశ్వాంత్ పాల్గొన్నారు. బాగా కష్టపడి కృషిచేసి చదువుకోవడం వల్లనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు మరియు ఆశయాలను సాధిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు టి.సునీల్ కుమార్, ప్రభావతి, సుజాత, రజనీ తదితరులు పాల్గొన్నారు.
