ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – విజయలక్ష్మి యాదగిరి
అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం
-ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా
-సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి విజయలక్ష్మి యాదగిరి పోటీలో ఉన్నారు. శనివారం నాడు మల్లారెడ్డిపల్లి, కాగజ్ గూడ గ్రామలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తు పై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మల్లారెడ్డిపల్లి, కాగజ్ గూడ గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తానని, గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి, గ్రామ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని, అధిక మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్తులు అందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు పై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి రాజు, జాల మల్లారెడ్డి, తిమ్మాపురం నరసింహులు, శ్రీకాంత్, వెంకటేష్, రాజు, శ్రీహరి, స్వామి, నాగరాజు, నర్సింలు, కనకయ్య, కరుణాకర్, బిక్షపతి, గోపాల్, మహేష్, చిత్తారి, బాలేష్, విజయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





