ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి

75 Views

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి

గ్రామపంచాయతీ అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయం – కొన్యాల బాలరెడ్డి

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కె, బి, ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొన్యాల బాలరెడ్డి పోటీ చేస్తున్నారు, శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం  మాట్లాడుతూ ముందుగా క్షీరసాగర్ కమలాబాద్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ కేబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు వేయాలని, మాకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు అలాగే మా ప్యానల్ వార్డు సభ్యులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు, పదవి ఉన్నా లేకున్నా సేవే లక్ష్యంగా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ లేని విధంగా గ్రామంలో ఉచిత మంచినీటి సౌకర్యం, గ్రామంలో అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవడంతో పాటు శ్రీరామనవమి రోజున భద్రాచలంలో నిర్వహించే శ్రీరామ కళ్యాణం వలె ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు, సర్పంచిగా అవకాశం ఇస్తే ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు. గ్రామ ప్రజలు మహిళలు ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు మాకు మా వార్డు మెంబర్ అభ్యర్థులకు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *