సిద్దిపేట కమిషనరేట్ లో 63వ హోం గార్డుల రైజింగ్ డే నిర్వహణ
Your message has been sent
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6,
ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో హోం గార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తూ, అంకిత భావం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవలతో సమాజానికి విశేష సేవలను అందిస్తున్నా హోం గార్డుల మహోన్నత సేవలకు గుర్తింపు తెలుపుతూ, నేడు సిద్దిపేట సిటీ సాయుధ పోలీసు కార్యాలయంలో *63వ హోం గార్డుల రైజింగ్ డే* ను ఘనంగా నిర్వహించడమైనది.
మొదటగా ఉదయం పరేడ్‌తో కార్యక్రమo ప్రారంభమయ్యాయి. ముందుగా హోం గార్డులు పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ కి వందనం సమర్పించారు.
నేరాల నివారణ, లా అండ్ ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు స్పందన, అత్యవసర సేవల్లో అసాధారణ కర్తవ్య నిబద్ధతతో పని చేసే ప్రతి ఒక్క హోమ్ గార్డు అధికారి సంపూర్ణ శక్తితో విధులు నిర్వహించాలని కోరడమైనది. ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్, క్రైమ్ డిటెక్షన్, కమ్యూనిటీ పోలీసు విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన కి ప్రశంసా పత్రాలు అందజేయడం అయినది.
అనంతరం హోంగార్డ్ అధికారుల నుండి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు , కమిషనరేట్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు అందులో భాగంగా మమత హాస్పిటల్ సిబ్బంది , కేర్ హాస్పిటల్స్ సిబ్బంది, హెల్త్ ఇన్సూరెన్స్ కోసమని ఆక్సిస్ బ్యాంక్ వాళ్లు పాల్గొన్నారు.
ఈ హోం గార్డుల రైజింగ్ డే వేడుకలకు అడిషనల్ డిసిపి (అడ్మిన్ ) కుశాల్కర్ , అడిషనల్ డీసీపీ ( ఏ ఆర్ ) సుభాష్ చంద్రబోస్ , ఆర్ ఐ లు కార్తీక్ ,ధరణి కుమార్ ,విష్ణు ప్రసాద్, భరత్ భూషణ్, ఎస్ఐ లు పుష్ప , నిరంజన్, మరియు ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





