నంగనూరు, ఘన్‌పూర్, గట్లమల్యాళ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6,
శాంతి భద్రతలను పెంపొందించడంలో భాగంగా, రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజలకు భరోసా కల్పించేందుకు, రాజగోపాల్ పెట్ పోలీస్ , ఈ రోజు నంగనూరు, ఘన్‌పూర్, గట్లమల్యాళ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించాయి.
జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ప్రజలు భయపడకుండా తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ఈ కార్యక్రమంలో రాజగోపాల్ పెట్ ఎస్సై వివేక్ , ఆర్ఎస్ ఐ పుష్ప , సిబ్బంది పాల్గొన్నారు.





