ప్రాంతీయం

ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి

74 Views

కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి-దిలాల్ పూర్ గ్రామ అభివృద్ధే లక్ష్యం-వెంకన్నగారి వెంకట్ రెడ్డి 

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకన్నగారి వెంకటరెడ్డి శనివారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని, ఇంటింటి ప్రచారంలో గ్రామస్తులందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి వైపు బాటలు వేసే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఓటర్లు నాకు కేటాయించిన కత్తెర గుర్తుకుఓటువేయలని, అలాగే మా ప్యానల్ వార్డు మెంబర్లగా దుర్గం కృష్ణ, జనగామ రంగా గౌడ్, జనగామ కావ్య, బండారు బాలగౌడ్, క్యాసారం లక్ష్మి, ఎండి మస్తాన్, క్యాసారం పోచయ్య, బోనాల రామవ్వ, మద్ది కిష్టారెడ్డి, పల్లపు కనకవ్వ పోటీలో ఉన్నారు. వీరందరికీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే గ్రామంలో యువత, పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరు మాకు అండగా ఉన్నారని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని, అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *