ప్రాంతీయం

అన్నదానం మహాదానం – అంజనీపుత్ర సేవలు

117 Views

మంచిర్యాల జిల్లా, చున్నంబట్టివాడ, 100 ఫీట రోడ్డు లో అంజనీపుత్ర ప్రైవేట్ లిమిటెడ్.

అన్నదానం మహాదానం – అంజనీపుత్ర సేవలు ఆదర్శనీయం మున్సిపల్ చైర్మన్ ఉప్పాలయ్య.

అంజనీపుత్ర సేవలు ఆదర్శనీయం
మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య అన్నారు. బుధవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిదులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

అనంతరం మున్సిపల్ ఛైర్మెన్ ఉప్పలయ్య ,అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ అంజనీపుత్ర యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందని ప్రజల లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు ఎస్ .కిషన్, సదానందం, డైరెక్టర్ లు తదితరు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్