ప్రాంతీయం

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం

82 Views

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం – షేర్ల గాయత్రి నర్సింలు

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి గాయిత్రి నర్సింలు 

సిద్దిపేట జిల్లా, గజ్వేల్, డిసెంబర్ 5

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా షేర్ల గాయత్రి నర్సింలు పోటీలో ఉన్నారు. శుక్రవారం నాడు ర్యాగట్లపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి షేర్ల గాయత్రి నర్సింలు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తు పై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామస్తులు అందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు పై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేర్ల నర్సింలు, షేర్ల వెంకటేశం, ధార నరసింహులు, మహేశుని గణేష్, మన్నె దయానంద్, షేర్ల రాజు, షేర్ల కృష్ణవేణి, మన్నె దేవేందర్, మహేషుని పాండు, మహేశుని కృష్ణవేణి, మహేశుని శివలక్ష్మి, ధార రాజు, షేర్ల లక్ష్మినారాయణ, శ్రీకాంత్, కుమార్, తేజ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *