ప్రాంతీయం

సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యాయత్నానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

12 Views

సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యాయత్నానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న మేడ్చల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో ఈశ్వర్ చారి ఆత్మహత్యకు ప్రయత్నించడం తో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జేబుకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ సభ పేరుతో అనేక హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అలాగే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో బీసీ ఉద్యమకారుడు ఈశ్వర్ చారి భావోద్వేగానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జరిగింది. ఈ సంఘటనకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఎంతమంది బలయితే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందో బీసీ సమాజానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రాణహాని జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, బీసీ నాయకులు గజెల్లి వెంకటయ్య ,శాఖపూరి భీమ్సేన్ ,చంద్రగిరి చంద్రమౌళి, మంచర్ల సదానందం, వేముల అశోక్ , చలిమల అంజయ్య , రామగిరి రాజన్నచారి,కొండా శ్రీనివాస్ పెద్దపల్లి సూరన్న, ఎండి రఫీ, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *