*రామగుండం పోలీస్ కమీషనరేట్*
మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా
సోషల్ మీడియా మద్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: పోలీస్ అంబర్ కిషోర్ ఝా.
మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యత లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో షీ టీమ్స్, స్కూల్, కళాశాలలు, ఆఫీస్ లు ముగిసే సమయానికి స్కూల్స్, కళాశాల, బస్టాండ్ ప్రధాన కూడళ్ళ వద్ద ఎక్కువగా బాలికలు, మహిళలు ప్రయాణాలు చేసే సమయంలో వారిని ఏవైనా ఇబ్బందులు పెడుతున్నారా అని క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య సాధారణ జనాల వలె మఫ్టీ లో ఉంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళల రక్షణ కోసమే షీటీం పని చేస్తుందని, కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య వచ్చినప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తున్నామని వివరించారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, లేదా ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు. ఎవరైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన, మాట్లాడడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉండటం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత. పోలీసు శాఖ మీకు అండగా ఉంటుంది. మీ భద్రత కోసం 24 గంటలు సిద్ధంగా ఉన్నాం, తప్పు చేస్తున్న వారి మీద చర్య తీసుకోవడానికి మీ సమాచారమే వారిపై చట్ట పరమైన చర్యలకు ఆధారం అన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితులలో *రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు.
నవంబర్–2025 నెలలో రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్ వద్ద మొత్తం పిటిషన్లు – 68.
మొత్తం 68 పిటిషన్లలో 15 పిటిషన్లు రామగుండం షీ టీం వాట్సాప్ నంబర్ ద్వారా మరియు ప్రత్యక్షంగా షీ టీమ్స్ రామగుండం (పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు) కార్యాలయాలకు ఇవ్వబడినవి. 53 – రెడ్ హ్యాండెడ్ పిటిషన్ lu
→ఈ 15 పిటిషన్లలో FIR – 04, పెట్టీకేసులు – 04, కౌన్సిలింగ్ నిర్వహణ – 02, హెచ్చరించి వదిలివేసినవి – 05
→ షీ టీమ్స్ పెద్దపల్లి & మంచిర్యాల జిల్లాల్లో పబ్లిక్ ఉండే ప్రాంతాలు, పార్కులు, షాపింగ్ మాల్ ప్రాంతాల్లో డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 60 మంది ఆఖతాయి లను పట్టుకుని పెట్టీకేసులు నమోదు చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి హెచ్చరించడం జరిగింది.
→మొత్తం 53 రెడ్ హ్యాండెడ్ కేసుల్లో
పెట్టీకేసులు – 05, కౌన్సిలింగ్ – 26, హెచ్చరించి వదిలివేయడం – 22
నవంబర్–2025 లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు.
పెద్దపల్లి జిల్లా – 29
మంచిర్యాల జిల్లా – 34
మొత్తం – 63
నవంబర్–2025 లో సందర్శించిన హాట్ స్పాట్స్.
పెద్దపల్లి జిల్లా – 117,
మంచిర్యాల జిల్లా – 115
మొత్తం – 232





