ప్రాంతీయం

చట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన

47 Views

చట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని రాష్ట్రాన్ని 79 సంవత్సరాలుగా పాలిస్తున్నారు దేశ జనాభాలో 60% ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నాం అలాగే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి. 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని బిజెపి ప్రభుత్వం బీసీ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం.
గత 40 సంవత్సరాలు చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా న్యాయమైన మా ప్రజాస్వామ్య వాటాకై ఉద్యమం చేస్తున్నప్పటికీ మా డిమాండ్ ను గత కాంగ్రెస్ ప్రభుత్వంగాని ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గానీ పెడచెవిన పెట్టడం అంటే ఇది పూర్తిగా బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నాం.ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండాలంటే ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా ఉండాలి ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబడతామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ నాయకులు గజల్లి వెంకటయ్య, షాకపూరి భీమ్సేన్, ఆరెందుల రాజేశం, అంకం సతీష్, చలిమల అంజయ్య, అంకం సతీష్, పెద్దపల్లి సూరయ్య ,రాజన్న చారి , శెట్టిపల్లి గట్టయ్య, ధర్మాజీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *