ప్రాంతీయం

మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు పరామర్శ

58 Views

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో ఆదివారం పరామర్శించడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన, జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మ శ్రీనివాస్ లతో కలిసి వారిని పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ రావు అకాల మృతి పట్ల చింతిస్తున్నామని, వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ ముబాషీర్, ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *