ప్రాంతీయం

ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ తప్పకుండా ధరించాలి

126 Views

 

 

ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ తప్పకుండా ధరించాలి

క్రమశిక్షణతో నడుచుకునే ఆటో డ్రైవర్లకు సన్మానించడం జరుగుతుంది

చట్ట వ్యతిరేకం కార్యక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపి సుమన్ కుమార్

సిద్దిపేట జిల్లా, నవంబర్ 29

ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ట్రాఫిక్ నియమాలు, వాహన పత్రాలు, రోడ్డు భద్రత, పార్కింగ్ నియమాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులే స్వయంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ ధరింపజేయడం పట్టణంలో ప్రత్యేక చర్చనీయాంశమైంది.

90% ఆటో డ్రైవర్లు యూనిఫామ్‌లో

ప్రస్తుతం సిద్దిపేటలో దాదాపు 90 శాతం ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. యూనిఫామ్ వలన డ్రైవర్‌ను త్వరగా గుర్తించే సౌలభ్యం, ప్రయాణికులకు భద్రత, ఆటో రంగంలో క్రమశిక్షణ పెంపు వంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫామ్ ధరించడం వలన డ్రైవర్లు ప్రయాణికులతో అనుచిత ప్రవర్తనకు దూరంగా ఉంటారని అధికారులు తెలిపారు.

స్థానిక ప్రజలు ఈ మార్పును ప్రశంసిస్తూ —

“ఇంతవరకు ఆటో డ్రైవర్లు ఇలా యూనిఫామ్‌తో కనిపించడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అందరూ చక్కగా యూనిఫామ్‌లో కనిపించడం చూసి భద్రతాభావం పెరిగింది” అని అభిప్రాయపడ్డారు.

అధికారులు ఒంటరి మహిళలపై అసభ్య ప్రవర్తన చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

“సీపీ  విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సిద్దిపేటలో ఆటో డ్రైవర్లలో క్రమశిక్షణ తీసుకురావడంలో ట్రాఫిక్ విభాగం చేస్తున్న కృషి అభినందనీయం.

యూనిఫామ్ డ్రైవ్‌కి ప్రజలు ఇస్తున్న మంచి స్పందన, ఈ కార్యక్రమం ఎంత ప్రభావవంతంగా ఉందో నిరూపిస్తుంది.యూనిఫామ్ వలన ఆటో డ్రైవర్ల గుర్తింపు సులభమవుతోంది, భద్రత పెరుగుతోంది, ప్రయాణికుల విశ్వాసం మరింత బలపడుతోంది.సిద్దిపేటను శాస్త్రీయ ట్రాఫిక్ పట్టణంగా తీర్చిదిద్దడానికి ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయి.క్రమశిక్షణ, మర్యాదతో సేవలు అందించే ఆటో డ్రైవర్లను నెలకు ఒకసారి గుర్తించి సన్మానించే కార్యక్రమాన్ని అమలు చేయనున్నాము” అని ఏసీపీ సుమన్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ విజయభాస్కర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *