23 Views
ముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారులచే నత్త నడకన సాగిపోయింది.. బంధనకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చిగురు నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైచిలుకు బంధనకల్ గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి ప్రజలకు చెరువలో సేవలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తున్న తరుణంలో నాగ్రామంలో నాప్రజలకు సేవలందించే శుభసూచకం ఉందన్నారు. నాడు ఎట్లుంది బీడు భూములుగా మారిన తెలంగాణ ప్రాంతంలో అన్నదాతల వరినాట్లు వేసినవి వేసినట్లు పొలాలు ఎండిపోయి బీటల్ గా మారాయన్నారు. మనుషులకి కాదు పశువులకు కూడా గాసం లేక కరువు కాటేయడంతో పశువులను అమ్ముకొని వ్యవసాయాన్ని వదిలి బొంబాయితో పాటు తదితర దేశాలకు రైతులు వలస పోయిన సంగతి తెలిసిందే.. ఎన్నో సంవత్సరాలుగా చెరువు నిండలేక బోరు బావులు ఇంకిపోయి రైతులు అల్లాడే స్థితిలో మల్లన్న సాగర్ నుండి బంధనకల్ చెరువు నిండడానికి సతవిధాల రైతులతో పాటు రేయింబవళ్లు కష్టపడ్డాను. అందరూ ఆలోచించి అమూల్యమైన ఓటర్లు ఒక్క అవకాశమిచ్చి గెలిపిస్తే రాత్రనక పగలనక గ్రామానికి శిరసా సేవలందిస్తానని కోరుకుంటున్నానని తెలిపారు.

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?




